హెడ్‌ స్కార్ఫ్‌ పదేళ్ళ చిన్నారి ప్రాణం తీసేసింది

- March 26, 2018 , by Maagulf
హెడ్‌ స్కార్ఫ్‌ పదేళ్ళ చిన్నారి ప్రాణం తీసేసింది

యు.ఏ.ఈ:10 ఏళ్ళ చిన్నారి ఆడుకుంటుండగా, ఆమె తలపై ధరించిన హెడ్‌ స్కార్ఫ్‌ (షిలా) ప్రమాదవశాత్తూ చుట్టుకుపోయి, ఆమె ప్రాణాల్ని తీసేసింది. గ్రేడ్‌ 5 స్టూడెంట్‌ ఈ ప్రమాదానికి గురైంది. అల్‌ తవైన్‌ ఏరియాలో, చిన్నారి స్పీడింగ్‌ బైక్‌పై ఆడుకుంటుండగా స్కార్ఫ్‌ అందులో ఇరుక్కుపోయి, ఆ స్కార్ఫ్‌ ఆమె తలకు గట్టిగా చుట్టేసుకుంది. ఊపిరి ఆడక, మెడ నరాలు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో ఆ చిన్నారి ప్రాణం పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చిన్నారిని ఆమె తండ్రి హుటాహుటిన ఖలీఫా సొసైటీ ఆసుపత్రికి తరలించగా, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com