అఖిల్ కొత్త సినిమా ప్రారంభం

- March 26, 2018 , by Maagulf
అఖిల్ కొత్త సినిమా ప్రారంభం

హైదరాబాద్‌: యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన మూడో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఉగాది రోజున ఈ విషయాన్ని అఖిల్‌ ప్రకటించారు. కాగా సోమవారం సాయంత్రం సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. అఖిల్‌పై ముహూర్తపు సన్నివేశానికి నాగార్జున క్లాప్‌ కొట్టారు. మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై.. కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా ఎవరు నటిస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.

వెంకీ అట్లూరి ఇటీవల 'తొలిప్రేమ'తో దర్శకుడిగా విజయం అందుకున్నారు. వరుణ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కూడా చక్కగా రాణించింది. అఖిల్‌ 'హలో' సినిమాతో గత ఏడాది చివర్లో మంచి హిట్‌ అందుకున్నారు. విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మించారు. ఇందులో ప్రేమకథతోపాటు అఖిల్‌లోని మాస్‌ కోణాన్ని కూడా చూపించారు. మరి ఈ నూతన చిత్రం ఏ తరహాలో ఉండబోతోందో తెలియాలంటే వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com