మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభం

- March 26, 2018 , by Maagulf
మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభం

మస్కట్‌: 10వ మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ (ఎంఐఎఫ్‌ఎఫ్‌) సోమవారం ప్రారంభమయ్యింది. పెద్ద సంఖ్యలో ఒమన్‌ షార్ట్‌ ఫిలింస్‌, డాక్యుమెంటరీలు ఈ ఏడాది ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. పలు రకాల జోనర్స్‌కి సంబంధించి, అలాగే కల్చర్‌కి సంబంధించి ఎంపిక చేయబడ్డ షార్ట్‌ ఫిలింస్‌ని ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తారు. ఒమన్‌ ఫిలిం సొసైటీ ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. సుల్తాన్‌ సలహాదారు అయిన అబ్దుల్‌అజీజ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ రోవాస్‌ (కల్చర్‌ ఎఫైర్స్‌) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com