ఐపీఎల్‌ అంబాసిడర్‌ గా ఎన్టీఆర్

- March 27, 2018 , by Maagulf
ఐపీఎల్‌ అంబాసిడర్‌ గా ఎన్టీఆర్

ఎన్టీఆర్ ఇప్పటికే బుల్లితెరలో బిగ్ బాస్ తెలుగు వెర్షన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షో బుల్లితెరలో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిదో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. తాజాగా ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర మీద ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2018 సిరీస్‌ తెలుగు ప్రసారాలకు ఎన్టీఆర్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రసార హక్కులను దక్కించుకున్న 'స్టార్ మా' ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషన్‌ బాధ్యతలను ఎన్టీఆర్‌ కు అప్పజెప్పిందట. బిగ్ బాస్ సక్సెస్ ను దృష్టిలో ఉంచుకొనే ఈ బాధ్యతను ఎన్టీఆర్ చేతుల్లో పెట్టినట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com