వచ్చే జూన్‌ కల్లా దేశంలో 5జి - టెలికాం కార్యదర్శి సుందరరాజన్‌

- March 27, 2018 , by Maagulf
వచ్చే జూన్‌ కల్లా దేశంలో 5జి - టెలికాం కార్యదర్శి సుందరరాజన్‌

న్యూఢిల్లీ: ఈఏడాది జూన్‌ కల్లా భారత్‌ 5జి సాంకేతికతకు పూర్తిస్థాయి మార్గసూచితో సిద్ధం కాగలదని టెలికాం కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ తెలిపారు. డిజిటల్‌ భారత్‌ లక్ష్య సాధనకు 5జి సాంకేతిక ముఖ్యమైనది ఆమె మంగళవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. 5జి సాంకేతికలో ముందువరుసలో నిలిచేందుకు విద్యా, పారిశ్రామిక, స్టార్టప్‌ తదితల లబ్ధిదారులందరితో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. 5జి సాంకేతికపై ఇప్పటికే అంతర్జాతీయ, పారిశ్రామిక నిపుణులు, ఐఐటిలు, ఐఐఎస్‌సిలతో కూడిన ఒక ఉన్నత స్థాయి ఫోరం ఇందుకు కృషి చేస్తోందని ఆమె వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com