ఫోర్బ్స్‌ జాబితాలో అనుష్క, పివి సింధు

- March 27, 2018 , by Maagulf
ఫోర్బ్స్‌ జాబితాలో అనుష్క, పివి సింధు

న్యూఢిల్లీ: ఆసియాలో 30సంవత్సరాల వయసులో ఉన్న పలు రంగాల్లో సత్తా చాటిన 300మంది ఎంటర్‌ప్రెన్యూర్లు, ఇన్నోవేటర్ల జాబితాను ఫోర్బ్స్‌ వెలువరించింది. ఆసియా 30 అండర్‌ 30-2018 పేరిట వెలువరించిన ఈ జాబితాలో బాలీవుడ్‌ కథానాయిక అనుష్క శర్మ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధులకు చోటు దక్కింది. వినోద, వాణిజ్య, వెంచర్‌ క్యాపిటల్‌, రిటైల్‌, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లు వంటి పలు రంగాల నుంచి పలువురిని ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది. ఇంకా ఈ జాబితాలో భారత్‌ నుంచి మోడల్‌ భూమిక అరోరా, సైనప్‌ సీఈవో అశ్విన్‌ రమేష్‌, అథ్లెట్‌ శ్రుతి మంథన, హెడ్‌కేర్‌ పౌండర్‌ దీపాంజలి దాల్మియా, హెల్త్‌ సెట్‌గో పౌండర్‌ ప్రియా ప్రకాశ్‌ వంటి యువ వాణిజ్యవేత్తలు, టెక్నొకాట్లున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com