షార్జా:28 ఏళ్ళ యువకుడ్ని బలిగొన్న అతివేగం
- March 27, 2018
షార్జా:అతి వేగం 28 ఏళ్ళ ఎమిరేటీ యువకుడ్ని బలిగొంది. షార్జాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. షార్జా పోలీసులు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం మలిహా రోడ్డులో అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షార్జా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అలై అల్ నక్బి మాట్లాడుతూ, అతి వేగంతో కారుని నడిపిన యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అతి వేగంతో కారు అదుపు తప్పి, పల్టీలు కొట్టిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో యువకుడు సీటు బెల్టుని కూడా ధరించలేదు. ఈ ప్రమాదంలో కారులో వున్న మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనల్ని పాటించాలని ఈ సందర్బంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..