సౌదీలో పౌరులపై దాడులను ఖండించిన భారత్‌

- March 28, 2018 , by Maagulf
సౌదీలో పౌరులపై దాడులను ఖండించిన భారత్‌

న్యూఢిల్లీ : రియాద్‌ ప్రాంతంలోను , సౌదీ అరేబియాలోని ఇతర నగరాల్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు సాగుతుండడాన్ని బుధవారం భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా పోరాడాలనే తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. యెమెన్‌ నుండి ఆదివారం ఇరానియన్‌ మద్దతుదారులైన హౌతి తిరుగుబాటుదారులు ఏడు క్షిపణులతో దాడి చేశారని, ఒక వ్యక్తి మృతి చెందాడని సౌదీ అధికారులు తెలిపారు. ఆ దాడులను ఖండిస్తూ భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి బుధవారం ఈ ప్రకటన విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com