ఛాయ్ బిజినెస్‌తో మిలీనియర్ అయిన అమెరికన్
- March 28, 2018
న్యూఢిల్లీ : ఛాయ్ బిజినెస్ ఓ అమెరికన్ మహిళను లక్షాధికారి చేసింది. అదీ కూడా రుచికరమైన భారతీయ టీ. కొలరాడోకు చెందిన బ్రూక్ ఎడ్డీ అనే అమెరికన్ మహిళ 2002లో భారత్‌ను సందర్శించింది. అనంతరం ఆమె 2006తో తిరిగి తన స్వదేశం అమెరికా వెళ్లిపోయింది. కానీ కొలరాడోలో కేఫ్‌ల్లో ఎక్కడ కూడా.. ఆమెకు అచ్చం భారత్‌లో దొరికిన మాదిరి రుచికరమైన టీ లభించలేదు. దీంతో ఆమెనే భారత భక్తి ఆదర్శాలతో ఓ ఛాయ్ వ్యాపారం చేపట్టాలని నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా వెంటనే 2007లో భక్తి ఛాయ్ పేరుతో ఛాయ్ వ్యాపారం ప్రారంభించేసింది. ఈ ఛాయ్ వ్యాపారమే ఇప్పుడు ఏడు మిలియన్ డాలర్ల రెవెన్యూ కంపెనీగా అవతరించింది.
ఈ ఛాయ్‌కి రుచిమరిగిన అమెరికన్లు, ఆ కంపెనీ టీ తాగకుండా ఉండలేకపోతున్నారు. బ్రూక్ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రోజురోజుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెద్ద ఎత్తున్న చేకూరుతోంది. అమెరికన్ వీక్లీ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2002లో భారత్ సందర్శించినప్పుడు తాను తాగిన టీ ఎంతో ఇష్టమని బ్రూక్‌చెప్పింది. ప్రతీసారి తాను ఏదో ఒక కొత్తదాన్ని ప్రవేశపెడుతుంటానని, ఇది కూడా అలాంటిదేనని పేర్కొంది. ఈ ఛాయ్ వ్యాపారం ప్రారంభించిన ఏడాది తర్వాత భక్తి ఛాయ్ తన తొలి వెబ్‌సైట్ కూడా లాంచ్ చేసింది. అలా తన వ్యాపారాలను వృద్ధి చేసుకుంటూ వచ్చింది. బ్రూక్ ప్రస్తుతం ఇద్దరు కవలలకు, సింగిల్ మదర్. ఫుల్-టైమ్ జాబ్‌కు గుడ్‌బై చెప్పి మరీ బ్రూక్ ఈ ఛాయ్ వ్యాపారంతో సామాజికంగా, పర్యావరణంగా మార్పు తీసుకొస్తోంది. 2014లో బ్రూక్ ఎడ్డీ, ఎంటర్‌ప్రిన్యూర్ మేగజైన్స్ ‘ఎంటర్‌ప్రిన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులో టాప్-5 ఫైనలిస్ట్.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







