పీఎఫ్ నగదు విత్ డ్రాఆన్లైన్ ద్వారా!
- December 01, 2015
ఇకపై ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలాన్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ మేరకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈపీఎఫ్ నగదు తీసుకోవాలంటే ఉద్యోగికి.. సంస్థ అనుమతి తీసుకోవాలి. ఇకపై సంస్థతో సంబంధం లేకుండా నేరుగా ఉద్యోగి తన పీఎఫ్ మొత్తాన్ని పొందవచ్చు. అయితే ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతాకు బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా జతచేసుకోవాలని జలాన్ సూచించారు. ప్రస్తుతం ఉన్న లిఖిత పూర్వక దరఖాస్తు విధానాన్ని పూర్తిగా మార్చి ఆన్‌లైన్‌ను ప్రవేశపెట్టనున్నామన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







