90వేల ఉద్యోగాలకు 2 కోట్ల దరఖాస్తులు.. ఆశ్చర్యపోతున్న కేంద్రప్రభుత్వం

- March 28, 2018 , by Maagulf
90వేల ఉద్యోగాలకు 2 కోట్ల దరఖాస్తులు.. ఆశ్చర్యపోతున్న కేంద్రప్రభుత్వం

ఇండియన్ రైల్వే శాఖ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల కింద 90వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 31 చివరి తేదీ. ఈ 90వేల ఉద్యోగాల కోసం అక్షరాల 2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. అది కూడా 27వ తేదీ వరకు మాత్రమే. మరో మూడు రోజులు గడువు ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. 2 కోట్ల అప్లికేషన్స్ లో 50లక్షల ఆన్ లైన్ ద్వారా వచ్చాయి. 90వేలలో.. 26వేల 502 ఉద్యోగాలు లోకో పైలట్, టెక్నీషియన్స్ కు సంబంధించినవి. దేశంలో యువత ఉపాధి, ఉద్యాగాల కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ఈ దరఖాస్తులు బట్టి తెలుస్తోంది.  ఈ సంఖ్యను చూసి కేంద్ర ప్రభుత్వం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com