బీచ్‌లు, పార్కుల్లో డ్రైవింగ్‌ని నిషేధించిన మస్కట్
- March 28, 2018
మస్కట్: బీచ్‌లు, పార్కుల్లో వాహనాల డ్రైవింగ్‌ని నిషేధిస్తూ మస్కట్ మునిసిపాలిటీ నిర్నయం తీసుకుంది. రాయల్ ఒమన్ పోలీస్‌తో కలిసి ఈ విషయమై ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మస్కట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ బదర్ బిన్ అలి అల్ బహ్రి మాట్లాడుతూ, సీబ్ బీచ్‌కి సంబంధించి పలు ప్రాంతాల్లో కాంక్రీట్ బారియర్స్‌ని ఏర్పాటు చేసి, వాహనాల ప్రవేశానికి అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. బీచ్‌లో నడుస్తూ వెళ్ళేవారికి ఈ వాహనాలు ప్రమాదకరంగా తయారవుతుండడం వల్లనే డ్రైవింగ్ నిషేధించినట్లు ఆయన చెప్పారు. బీచ్ పొడవునా, డ్రైవింగ్ నిషేధానికి సంబంధించి హెచ్చరిక బోర్డుల్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







