అభిమాని కోసం మోకాలి మీద కూర్చుని.. సెల్ఫీ దిగిన ప్రభాస్‌

- March 29, 2018 , by Maagulf
అభిమాని కోసం మోకాలి మీద కూర్చుని.. సెల్ఫీ దిగిన ప్రభాస్‌

హైదరాబాద్‌: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. ఇందుకు యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన అభిమాని కోసం చేసిన పనే నిదర్శనం. ఇంతకీ ప్రభాస్‌ ఏం చేశారంటే.. ఇటీవల ఆయన ఫ్యాన్స్‌తో మీట్‌ అండ్‌ గ్రీట్‌ సెషన్‌లో పాల్గొన్నారట.

ప్రభాస్‌ని చూసేందుకు దివ్యాంగుడైన ఓ అభిమాని వచ్చాడు. సెల్ఫీ దిగాలని ఉందని కోరాడు. ఇందుకు ప్రభాస్‌ వెంటనే ఒప్పుకోవడమే కాదు... అభిమానికి సౌకర్యంగా ఉండేలా మోకాలిపై కూర్చుని సెల్ఫీకి పోజిచ్చారు. ప్రభాస్‌ సెల్ఫీ దిగుతున్నప్పుడు పక్కనే ఉన్నకొందరు అభిమానులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

దాంతో ఈ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారాయి. 'మనసున్నోడు' అంటూ నెటిజన్లు ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్‌ మంచితనానికి తెలుగు అభిమానులే కాదు బాలీవుడ్‌ ప్రముఖులూ ఫిదా అయిపోయారు. 'బాహుబలి 2' సక్సెస్‌ అయిన సందర్భంగా దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్ తన నివాసంలో పార్టీ నిర్వహించారు.

ఈ పార్టీకి బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు ప్రభాస్‌ కూడా వెళ్లారు. అప్పుడు నటుడు వరుణ్‌ ధావన్‌ ప్రభాస్‌ని చూసి 'రండి సర్‌' అన్నారట. ఇందుకు ప్రభాస్‌ 'సర్‌ కాదు ప్రభాస్‌' అన్నారు. ఈ విషయాన్ని ఒకప్పుడు వరుణ్‌ ధావన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రభాస్‌ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నారు. సుజిత్‌ దర్శకుడు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com