'టైమ్స్' అత్యంత ప్రభావశీలురు ఎవరో చూడండి
- March 29, 2018
న్యూయార్క్: ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ ఏటా విడుదల చేసే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలుర జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు మరోసారి పరిశీలనకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రభావితం చేసే ప్రముఖ రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణలతో ఏటా ప్రభావశీలుర జాబితాను విడుదల చేస్తుంటుంది టైమ్స్ మ్యాగజైన్. ఏప్రిల్లో ఈ జాబితాను విడుదల చేయనున్నారు. ఇందుకు గానూ మోదీ సహా పలువురు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తున్నారు.
ఈ ఏడాది ప్రభావశీలుల జాబితాలో చోటు కోసం మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, బ్రిటన్ రాజ కుటుంబీకులు ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్, ప్రిన్స్ హ్యారీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు పోటీ పడుతున్నారు.
2015, 2016, 2017లో విడుదల చేసిన ప్రభావశీలుల జాబితాలోనూ ప్రధాని మోదీ స్థానం సంపాదించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!