నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్ 08

- March 29, 2018 , by Maagulf
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్ 08

శ్రీహరికోట : నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 08 నింగిలోకి దూసుకెళ్లింది. జీశాట్ ఎఫ్6ఏ ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అవసరాలకు జీశాట్ -6ఏ ఉపయోగపడనుంది. సమాచార విప్లవానికి జీశాట్ -6ఏ మరింత ఊతమివ్వనుంది. మల్టీ బీమ్ కవరేజ్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్ జీశాట్ -6ఏ అందించనుంది. మొబైల్‌ రంగంలో పదేళ్లపాటు జీశాట్‌-6ఏ సేవలందించనుంది. ఇస్రో చైర్మన్‌గా డాక్టర్ శివన్‌కు ఇదే మొదటి ప్రయోగం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com