ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే గృహ రుణాలు: ఎస్బిఐ
- March 30, 2018
న్యూఢిల్లీ: ఎస్బిఐ ఖాతాదారులకు శుభవార్త. గృహాల కొనుగోలు కోసం ఎస్బిఐ నుండి రుణాలు తీసుకొనేవారికి ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఒక్క పైసా ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే గృహ రుణాలను మంజూరు చేయనున్నట్టు ఎస్బిఐ ప్రకటించింది.
ప్రభుత్వ బ్యాంకింగ్ సెక్టార్లో ఎస్బిఐ అతి పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకు నుండి గృహ రుణాలను తీసుకొనే వారికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే ఈ రుణాలను మంజూరు చేస్తామని ఎస్బిఐ ప్రకటించింది. అయితే ఈ అవకాశం మార్చి 31వరకు మాత్రమేనని ఎస్బిఐ ప్రకటించింది.
కేవలం ఒక్క రోజు వ్యవధి మాత్రమే ఉంది. ఒక్క రోజులో బ్యాంకు రుణాలు తీసుకొనేవారికి ఈ అవకాశం దక్కనుంది. ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎస్బిఐ బ్యాంకుకు మారిన వారికి కూడ ఈ అవకాశం వర్తించనుందని ఎస్బిఐ ప్రకటించింది.
మార్చి 31వ తేదితో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో ఖాతాదారులను ఆకర్షించేందుకుగాను ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకొందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అవకాశం ఒక్క రోజుకే పరిమితమైంది.
మరోవైపు ఇప్పటివరకు ఎస్బిఐ అనుబంధ బ్యాంకుకు చెందిన చెక్‌బుక్‌లు మార్చి 31వరకు పని చేస్తాయని ఎస్బిఐ ప్రకటించింది. అయితే ఆ గడువు కూడ సమీపించింది. దీంతో మార్చి 31 తర్వాత కొత్త చెక్ బుక్‌లను తీసుకోవాలని ఎస్బిఐ ప్రకటించింది. ఏప్రిల్ నుండి కొత్త చెక్‌లను మాత్రమే అనుమతించనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.
ఈ మేరకు ఎస్బిఐ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఏప్రిల్ నుండి ఎస్బిఐ ఖాతాల్లో కనీస నగదు నిల్వలను చేయకపోతే విధించే ఛార్జీలను భారీగా తగ్గించింది. పట్టణాల్లో నెలకు రూ. 15, గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులపై రూ.10 జరిమానాను విధించనున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!