ముగిసిన మస్కట్ ఫిలిం ఫెస్టివల్
- March 31, 2018
మస్కట్: 10వ మస్కట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ శనివారం ముగిసింది. బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా, దర్శకుడు అలీ బద్రాఖాన్, నటుడు దావూద్ హుస్సేన్, నటి ఫక్రియా ఖామిస్, జహ్రా అరాఫత్ తదితరులు ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగర్ మెహర్ ఖాన్ సహా పలువురు కళాకారుల ప్రదర్శనల్ని ప్రేక్షకులు ఆస్వాదించారు. సాయంత్రం 6.30 నిమిషాలకు రెడ్ కార్పెట్ కార్యక్రమం జరిగింది. ఒమనీ జాతీయ గీతంతో ఈవెంట్ ప్రారంభమయ్యింది. ఒమన్ ఫిలిం సొసైటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ అల్ కింది ప్రారంభోపన్యాసం చేశారు. సలాలా నుంచి వచ్చిన బృందం ప్రదర్శించిన ఫోక్ బ్యాండ్ ఆహూతుల్ని అలరించింది. ఎంఐఎఫ్ఎఫ్ సినిమా అవార్డులు, హానరీ అవార్డుల్ని ఈ వేదికపై విజేతలకు అందించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..