మ్యూజియంలో 'హాకింగ్ కుర్చీ, కంప్యూటర్'

మ్యూజియంలో 'హాకింగ్ కుర్చీ, కంప్యూటర్'

ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఇటీవల కన్నుమూసిన విషయ తెలిసిందే. అయితే ఆయనకు చెందిన చక్రాల కుర్చీని, ఆయన సంభాషించేందుకు వాడిన ప్రత్యేక కంప్యూటర్‌ను ప్రజా సందర్శనకు ఉంచే అవకాశముందని బ్రిటన్‌కు చెందిన ఓ పత్రిక తెలిపింది. లండన్‌లోని సైన్స్‌ మ్యూజియంలో హాకింగ్‌ జీవితచరిత్ర, ఉపన్యాసాల వీడియోలతో పాటు చక్రాల కుర్చీ, కంప్యూటర్‌ను ప్రదర్శనకు ఉంచే అవకాశముందని పేర్కొంది. హాకింగ్‌ వాడిన చక్రాల కుర్చీ స్వీడన్‌లో తయారైందనీ, ఓసారి చార్జింగ్‌ పెడితే ఇది గంటకు 13 కి.మీ వేగంతో 32 కి.మీ దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు.

Back to Top