హీరో రానా @ 'కేరాఫ్ కంచరపాలెం'
- April 03, 2018
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ వారుసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు మనవడు..సురేష్ బాబు తనయుడు రానా 'లీడర్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్న పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చాటుకుంటూ వస్తున్నాడు.
బాహుబలి లాంటి గొప్ప ప్రాజెక్ట్ లో ప్రతినాయకుడిగా మెప్పించాడు. ఇప్పుడు నిర్మాతగానూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. న్యూయార్క్ కు చెందిన పరుచూరి ప్రవీణ నిర్మించిన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి సమర్పిస్తున్నారు. చాలా ఏళ్లు సినీ రంగంలోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్న ప్రవీణ.. అపర్ణ మల్లాది సహాయంతో వెంకట్ మహా దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇటీవల హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ షోలో కేరాఫ్ కంచరపాలెం సినిమాను చూసిన నిర్మాణ సురేష్ బాబు, హీరో రానాలు చిత్రంలో భాగస్వాములయ్యేందుకు అంగీకరించారు. 50 ఏళ్లు దాటిన పెళ్లి కాని రాజు, క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడిన సుందరం అనే స్కూల్ విద్యార్థి, పనీపాట లేకుండా తిరుగుతూ డ్యాన్సర్‌ను ప్రేమించే జోసఫ్ అనే యువకుడు, ఓ వేశ్యతో గాఢ ప్రేమలో మునిగిన గడ్డం అనే వ్యక్తుల మధ్య జరిగే సన్నివేశాలు..వాళ్ల ప్రేమపోరాటాలు, ఆరాటాలు, జీవితాల కథే సినిమా కథ ఎన్నో నెలలపాటు శ్రమించి పూర్తిగా వైజాగ్‌లోనే ఈ మూవీని చిత్రీకరించారు. కేన్స్‌లో ప్రదర్శించాలన్న ఆశయంతో తెరకెక్కించిన ఈ అచ్చ తెలుగు సినిమా న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు అర్హత సాధించిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







