ట్యాక్సీ ఫేర్‌ పెంచిన అజ్మన్‌

- April 03, 2018 , by Maagulf
ట్యాక్సీ ఫేర్‌ పెంచిన అజ్మన్‌

అజ్మన్‌లో ట్యాక్సీ ధరలు పెరిగాయి. 2.50 దిర్హామ్‌ల మేర పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అజ్మన్‌ విజన్‌ 2021లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అజ్మన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. డ్రైవర్స్‌కి సంబంధించి ఆదాయ సమస్యలు ఈ పెంపుతో కొంతమేర తగ్గుతాయని అజ్మన్‌ సంస్థ వెల్లడించింది. పూర్తయిన ప్రయాణానికి అదనంగా 2.50 దిర్హామ్‌లు చెల్లించాల్సి వుంటుందని అధికారి ఒకరు పేర్కొన్నారు. పెంచిన ధరల తర్వాత కూడా ఇతర ఎమిరేట్స్‌తో పోల్చితే అజ్మన్‌లోనే అతి తక్కువగా ట్యాక్సీ ధరలున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com