ఈ నెల 12 నుంచి హైదరాబాద్ ఫెస్ట్-2018
- April 03, 2018
హైదరాబాద్ : హైదరాబాద్ ఫెస్ట్-2018ను ఏప్రిల్ 12 నుంచి 22వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు అధ్యక్ష, కార్యదర్శులు నంద్యాల నరసింహరెడ్డి, కె చంద్రమోహన్లు తెలిపారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్ట్ గ్యాలరీ, సైన్స్ ఫెయిర్, ఫిల్మ్ ఫెస్టివల్, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఫెస్ట్‌కు హాజరయ్యేవారిని ఆకట్టుకునేలా ప్రతిరోజు కళా ప్రదర్శనలు, ప్రముఖుల కవితలు, ఉపన్యాసాలను ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యార్థుల్లోని ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీసేలా సైన్స్ ఎగ్జిబిషన్ చేపడుతున్నట్టు ఫెస్ట్ నిర్వహకులు తెలిపారు. అంతే కాకుండా విద్యార్థులకు కథలు, కవితల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. హైదరాబాద్ చరిత్ర ప్రతిబింబించే అంశాలతో పాటు, తెలంగాణ కళలను ప్రోత్సహించే దిశగా ఫెస్ట్‌ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఐదు లక్షల మందికి పైగా ఫెస్ట్‌కు హాజరవుతారని, ప్రజలు దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!