పిలుపొస్తే తప్పకుండా చేస్తా - జూ.ఎన్టీఆర్

- April 04, 2018 , by Maagulf
పిలుపొస్తే తప్పకుండా చేస్తా - జూ.ఎన్టీఆర్

నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య దూరం అందరికి తెలిసిందే. కారణం ఇది అని ఎవరు చెప్పకున్నా సరే వారి మధ్య దూరం దూరంగానే ఉంది. మధ్యలో సంధి కుదిర్చే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఓపెనింగ్ కు అందరిని పిలిచి జూనియర్ ను లైట్ తీసుకున్నాడు బాలయ్య బాబు.

ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో సినిమాకు రెడీ అవుతుండగా ఈమధ్యలోనే ఐపిఎల్ యాడ్ చేశాడు. దాని కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ పై స్పందించాడు ఎన్.టి.ఆర్. అక్కడ నుండి పిలుపొస్తే తప్పకుండా చేస్తా అన్నాడు. కాని ఆ పిలుపు వస్తుందన్న నమ్మకం లేదు.

ఎందుకంటే సినిమా ఓపెనింగ్ కే ఆహ్వానించడం ఇష్టం లేని బాలకృష్ణ సినిమాలో ఎలా అవకాశం ఇస్తాడు. బాలకృష్ణ ఎన్.టి.ఆర్ మీద చూపిస్తున్న ఈ వివక్ష నందమూరి ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నా ప్రస్తుతానికి సరే అని సర్ధుకుంటున్నారు. అయితే ఎన్.టి.ఆర్ మాత్రం తెలివిగా బాల్ అవతల కోర్ట్ లోకి వేసేశాడు.

ఇక మీదట కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ గురించి తన దగ్గర ప్రస్థావించకుండా సమాధానం ఇచ్చాడు తారక్. మరి ఈ దూరం దగ్గర అయ్యే పరిస్థితులు కబడకున్నా అభిమానుల కోసం అయినా వీరు కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఏమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com