కామన్వెల్త్ గేమ్స్‌లో ఖాతా తెరిచిన భారత్
- April 04, 2018
21వ కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో నిన్న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కామన్వెల్త్ గేమ్స్ లో ఖాతా తెరిచింది భారత్. వెయిట్‌లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. 261 కిలోల బరువును ఎత్తిన మలేసియా వెయిట్ లిప్టర్ మహ్మద్ ఇజార్ అహ్మద్. గోల్డ్ మెడల్ సాధిస్తే. 249 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచిన గురురాజాకు సిల్వర్ మెడల్ దక్కింది. శ్రీలంక లిఫ్టర్ లక్మల్ 248 కేజీల బరువును ఎత్తేసి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. భారత్‌కు 56 కేజీల విభాగంలో ఇదే ఫస్ట్ మెడల్ కావడం విశేషం.
గ్లాస్గోలో జరిగిన గత కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టు 15 స్వర్ణాలు, 30 రజతాలు, 18 కాంస్యాలతో పతకాల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21వ కామన్వెల్త్ గేమ్స్ 12 రోజుల పాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించనుండగా. కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం 6600 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీపడుతున్నారు. ఈ సారి మరిన్ని పతకాలు సాధించి భారత్. ప తకాల పట్టికలో మరింత ముందుకు సాగాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









