సల్మాన్ ఖాన్‌కు కోర్టు ఐదేళ్ల శిక్ష
- April 05, 2018
న్యూఢిల్లీ : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ కు జైలుశిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానా విధించింది. కాగా జోధ్‌పూర్ కోర్టు తీర్పు నేపథ్యంలో కండలవీరుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. జింకలను క్రూరంగా వేటాడిన సల్మాన్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు.
కాగా, జోధ్‌పూర్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. సల్మాన్ దోషిగా తేలడంతో ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ఆయన సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!