ఈ నెల 9 నుంచి వైఎస్ ఆర్ బయోపిక్ మూవీ 'యాత్ర' షూటింగ్ ప్రారంభం..
- April 06, 2018
తెలుగు ప్రజల ఎమోషనల్ ప్రజానాయకుడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను యాత్ర పేరుతో తెరకెక్కిస్తున్నారు.. గా తెరకెక్కుతున్నచిత్రం యాత్ర.. వైఎస్ ఆర్ పాత్రలో ప్రముఖ మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించనున్నాడు..ఈ మూవీ షూటింగ్ ఈ నెల 9వ వ తేదిన ప్రారంభంకానుంది. ఈ విషయాన్నిఒక ప్రత్యేక పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది..ఈ పోస్టర్ లో రెండు పాద ముద్రలపై యాత్ర అనే టైటిల్ ను ముద్రించారు.. కడప దాటి ప్రతీ గడపలోకి వస్తున్నాను..మీతో కలసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది అనే క్యాప్షన్ ఉంచారు.. .భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకి అందించిన 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నఈ తృతీయ చిత్రం యాత్రకు ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ ఆనందో బ్రహ్మతో తమ సంస్థకు ద్వితీయ విజయాన్ని అందించిన మహి వి రాఘవ్ డైరెక్షన్ లో మరో సినిమాను నిర్మించడం చాలా ఆనందంగా ఉందని, యాత్ర కోసం మహి రెడీ చేసిన లైన్ నచ్చడంతో సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా తెలిపారు విజయ్ చిల్లా. అలానే తమ సినిమాలో ముఖ్య పాత్రయిన వైఎస్ఆర్ పాత్రలో నటించడానికి మమ్ముట్టి అంగీకరించడం చాలా ఆనందం కలిగింది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆరాదించే నాయకుడు, ఎమోషనల్ గా ప్రజలకు దగ్గరైన వ్యక్తి వైయస్. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్ తో ఎమెషనల్ కంటెంట్ గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నామని తెలిపారు..
బ్యానర్ : 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్ప్
నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
కథ, దర్శకత్వం : మహి వి రాఘవ్
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







