కెనడాలో బస్సు ప్రమాదం 14 మంది ప్లేయర్లు మృతి

- April 07, 2018 , by Maagulf
కెనడాలో బస్సు ప్రమాదం 14 మంది ప్లేయర్లు మృతి

కెనడాలో ఘోర  రోడ్డు   ప్రమాదం జరిగింది.  ఈ  ప్రమాదంలో  14 మంది జూనియర్ హాకీ ప్లేయర్లు మృతిచెందారు. సస్‌కచివాన్ రాష్ట్రంలో  ఈ    ఘటన చోటుచేసుకున్నది . ఐస్ హాకీ ప్లేయర్లతో వెళ్తోన బస్సు   ట్రక్కును ఢీకొట్టడంతో  ఈ  ప్రమాదం  జరిగింది.  పోలీసులు  తెలిపిన వివరాల  ప్రకారం  సుమారు 28 మంది ప్లేయర్లు  బస్సులో ఉన్నట్లు విరిలో 14 మంది  గాయపడగా 14 మంది  మృతి చెందారు.  అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ విషాదం పట్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంతాపం తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com