మీకిదే నా గిఫ్ట్ - మహేష్
- April 10, 2018
ఈ మద్య సినీతారలు సిని పూర్తయిన తర్వాత..సినిమా మంచి సక్సెస్ సాధిస్తే..తమ టీమ్ కి అదిరిపోయే గిఫ్ట్ లు బహుమానంగా ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్లు తమ టీమ్ కి మంచి మంచి గిఫ్ట్ లు ఇవ్వడం చూశాం..తాజాగా ఇదే పద్దతి ఫాలో అయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు. 'భరత్ అనే నేను' సినిమాను ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఆ రోజు కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా అవుట్ పుట్ పట్ల మహేశ్ బాబు పూర్తి సంతృప్తితో వున్నాడట.
ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసి .. మంచి అవుట్ పుట్ కి కారణమైన డైరెక్షన్ టీమ్ ను ఆయన ఎంతగానో అభినందించాడట. అంతేకాకుండా ఆ సంతోషంతో వాళ్లందరికీ 'ఐ ఫోన్ X'లను కానుకలుగా ఇచ్చాడట. మహేష్ బాబు నటిస్తున్న తొలి పొలిటికల్ ఎంటర్టెనర్ ఇది. ఇందులో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు.
మహేష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహించారు. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో 'భరత్ బహిరంగ సభ' పేరుతో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు వేలాది మంది అభిమానులు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో మరింత హైప్ వచ్చింది.
సభ ముగిసిన అనంతరం ఎన్టీఆర్, రామ్ చరణ్, చిత్ర బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు మహేష్ దంపతులు. గతంలో 'శ్రీమంతుడు' హిట్ ను ఇచ్చిన కొరటాలకు మహేశ్ ఖరీదైన కారును కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..