దుబాయ్‌లో స్మార్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ టన్నెల్‌ అతి త్వరలో

- April 10, 2018 , by Maagulf
దుబాయ్‌లో స్మార్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ టన్నెల్‌ అతి త్వరలో

దుబాయ్‌: దుబాయ్‌ ఎయిర్‌ పోర్‌&్ట్స, స్మార్ట్‌ టన్నెల్‌ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మే నెలాఖరుకు ఇది అందుబాటులోకి వస్తుంది. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ మరియు ఫారిన్‌ ఎఫైర్స్‌ - దుబాయ్‌ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) డైరెక్టర్‌మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ అహ్మద్‌ అల్‌ మెర్రి మాట్లాడుతూ దుబాయ్‌లో పాస్‌పోర్ట్‌ కంట్రోల్‌కి సంబంధించి ఇది కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ టన్నెల్‌ ప్రయోగాత్మక దశలో వుందని చెప్పారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఈ టన్నెల్‌ పనిచేస్తుంది. గత ఏడాది జిటెక్స్‌ టెక్నాలజీ వీక్‌లో ఈ స్మార్ట్‌ టన్నెల్‌ని ఆవిష్కరించారు. బయోమెట్రిక్‌ సిస్టమ్‌ ఇందులో కీలకం. ప్రయాణీకులు ఏమీ చెయ్యకుండానే ఈ టన్నెల్‌ ద్వారా ప్రయాణించొచ్చు. పాస్‌పోర్ట్‌ని చూపించాల్సిన అవసరం లేదు. ఇది ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. కేవలం 10 సెకెన్లలోనే పని పూర్తి చేస్తుంది. టన్నెల్‌ ముందు ప్రయాణీకులు నిల్చుంటే ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా మిగతా పనులు పూర్తయిపోతాయి. ఆ తర్వాత టన్నెల్‌ నుంచి ఎగ్జిట్‌ అవ్వొచ్చు.
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com