రాజమౌళి మూవీలో ఈగ రీ ఎంట్రీ..!!

- April 11, 2018 , by Maagulf
రాజమౌళి మూవీలో ఈగ రీ ఎంట్రీ..!!

బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి కాంపౌండ్ నుంచి మరే సినిమా రాలేదు. అయితే రాంచరణ్, ఎన్టీఆర్‌లతో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరెకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ చిత్రంలో వీరిద్దరితో పాటు నానీ రోల్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఏమీ లేదు ఆ చిత్రం పూర్తిగా ఎన్టీఆర్,చరణ్ లకు సంబంధించిన చిత్రమని చెప్పారు. తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం ప్రమోషన్‌లో భాగంగా అడిగిన ప్రశ్నలకు నానీ పై విధంగా స్పందించాడు. అయితే రాజమౌళితో కలిసి పనిచేయాలని ఉందని, ఆ అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నానని అన్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com