అబుదాబీలో నేషనల్‌ డే ఈవెంట్‌ సూపర్బ్‌

- December 03, 2015 , by Maagulf
అబుదాబీలో నేషనల్‌ డే ఈవెంట్‌ సూపర్బ్‌

యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌కి సెల్యూట్‌ చేస్తూ నేషనల్‌ డే ఈవెంట్‌ అద్భుతంగా జరిగింది. ఫిషర్‌మెన్‌, పెరల్‌ డైవర్స్‌, ఒయాసిస్‌ డ్వెల్లర్స్‌, సాలుకి మరియు ఫాల్కన్‌ హంటర్స్‌ డిసెంబర్‌ 2న జరిగిన నేషనల్‌ డే వేడుకల్లో అద్భుతమైన ప్రదర్శనలిచ్చారు జాయెద్‌ స్పోర్ట్స్‌ స్టేడియంలో అధికారికంగా నేషనల్‌ డే ఈవెంట్‌ జరిగింది. యూఏఈ జాతీయులకు మరియు నివాసితులకు ఉచితంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు షో ప్రారంభం కాగా, 2 గంటల నుంచే ప్రజలు తరలివచ్చారు. పోయెట్రీ మరియు పేట్రియాటిక్‌ సాంగ్స్‌, 44 ఏళ్ళ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన వీడియోలతో సుదీర్ఘమైన పెరేడ్‌ని నిర్వహించారు. లేజర్‌ వెలుగులతో రూపొందించిన కార్యక్రమంతో ఈ ఈవెంట్‌ ముగిసింది. అంతకు ముందు పిల్లలు, పెద్దలతో కలిసి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com