తెలంగాణ: మక్కాలో ఉచిత వసతికి 1286 మంది ఎంపిక

- April 11, 2018 , by Maagulf
తెలంగాణ: మక్కాలో ఉచిత వసతికి 1286 మంది ఎంపిక

హైదరాబాద్‌: హజ్‌ యాత్రకు మక్కాలో ఉచిత వసతి సదుపాయం కల్పించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. హైదరాబాద్‌ చౌమాహల్లా ప్యాలెస్‌లో ఉపముఖ్యమంత్రి మహమ్మద్‌అలీ, హజ్‌కమిటీ ఛైర్మన్‌ మసిహుల్లాఖాన్‌ ఆధ్వర్యంలో డ్రా ద్వారా ఎంపిక నిర్వహించారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారి నుంచి 1286 మందిని రుబాక్‌ కోసం ఎంపిక చేశారు. ఎంపికైన వారికి మక్కాలో ఉచిత వసతి, భోజనం, రవాణా సదుపాయం లభిస్తుందని అలీ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com