సౌదీఅరంకో భారీ పెట్టుబడులు
- April 11, 2018
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద చుమురు ఉత్పత్తి కంపెనీ అరంకో భారత్‌లోని వెస్ట్ కోస్ట్ రిఫైనరీలో 50 శాతం పెట్టుబడులు పెడుతూ బుధవారం ఒప్పందాలపై సంతకాలు కూడా చేసింది. ఈ రిఫైనరీపై సుమారు రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు అవుతాయని అంచనా. కాగా సౌదీ అరంకో దేశంలోని రిటైల్ పెట్రోలియం వ్యాపారంలో కూడా అడుగుపెట్టడానికి ఉత్సాహం చూపుతోంది. ఇదిలా ఉండగా సౌదీ అరంకో బుధవారం నాడు ఇక్కడ దేశంలోని అతి పెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)తో అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. ఈ కంపెనీలన్నీ కలిసి మహారాష్ట్రలో రిఫైనరీ పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్‌ను అభివృద్ది చేయనున్నాయి. దీనికి రత్నగిరి రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఆర్‌ఆర్‌పీసీఎల్)గా పెరుపెట్టారు.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం 2025 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టులో ఏడాదికి 60 మిలియన్ టన్నుల చమురుశుద్ది జరుగుతుందని అంచనా. అటు తర్వాత అరంకో ఈ ప్రాజెక్టులోకి ఇతర భాగస్వాములును ఉదాహరణ అబుదాభి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడ్‌నాక్) తీసుకొస్తుంది. ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి ఈ కంపెనీ కూడా ఉత్సాహం చూపుతున్నట్లు చెబుతున్నారు.
తాజా ఒప్పందంపై సౌదీ అరేబియాకు చెందిన ఎనర్జీ అండ్ మినరల్ రీసోర్సెస్ మంత్రి ఖాలిద్ అల్ ఫాలిహ్ మాట్లాడుతూ.. భారతీయ కంపెనీల్లో రెండు బ్లాకుల్లో 50 శాతం పెట్టుబడులు పెడతామన్నారు. మిగిలినవాటిలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆసక్తి చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లను కూడా భాగస్వాములు తీసుకుంటామని ఆయన వివరించారు. వెస్ట్ కోస్ట్ రిఫైనరీకి కావాల్సిన ముడిచమురులో 50 శాతం ముడి చమురు తాము సరఫరా చేసామ్తని ఖాలిద్ చెప్పారు. దీంతో పాటు ఈ ప్రాజెక్టుకు కావాల్సిన కొత్త టెక్నాలజీని అందిస్తామన్నారు. ఈ రిఫైనరీలో రోజుకు 12 లక్షల పీపాల ముడిచమురు శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని, అలాగే ఏడాదికి 60 మి లియన్ టన్నుల ముడిచమురునుశుద్ది చేస్తుందన్నారు. దీంతో పాటు సుమారుగా 18 మిలియన్ టన్నుల పెట్రోరసాయనాలను ఉత్పత్తులను ఇక్కడ ఉత్పత్తి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఖాలిద్ అల్ ఫాలిహ్ వెస్ట్ కోస్ట్ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేపడుతున్నందుకు కంపెనీలకు పెట్టుబడులపై వడ్డీభారం తగ్గుతుందన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ కంపెనీకి అత్యధిక రేటింగ్ ఉండటమేనని ఆయన వివరించారు. దీంతో పాటు తమ కంపెనీ పెట్రోలియం రిటైల్ రంగంలోకి అడు గుపెడుతుందన్నారు. రిటైల్ పెట్రోలియం, పెట్రో కెమికల్స్ కోసం ప్రత్యేకంగా పెట్టుబడుల పెట్టే విషయం ఆలోచిస్తున్నామన్నారు. రిటైల్ పెట్రోలియం మార్కెట్‌లో ప్రవేశించి వినియోగదారుల అవసరాలను తీరుస్తామన్నారు. దీనిపై పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ. సౌదీ అరేబియా రిటైల్ పెట్రోల్‌రంగంలో ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు నియంత్రణా సంస్థల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు.సౌదీ అరంకో ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిన్ హెచ్ నాస్సార్ మాట్లాడుతూ. ఈ ప్రాజెక్టు ద్వారా సౌదీ అరంకో ముడిచమురు సరఫరా దారుడి పాత్రే కాకుండా .. ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాగా ఈ ప్రాజెక్టు 2025 నాటికి పూర్తవుతుందని అంచనా.కాగా ఈ రిఫైనరీ రత్నరిగిలోని రెండు ప్రాంతాల్లో చోటు చేసుకోబోతోంది.
ప్రధాన కాంప్లెక్స్ 14వేల ఎకరాల స్థలంలో బాబుల్‌వాడిలో ఉంటే.. మరో 15 కిలోమీటర్ల దూరంలో 1,000 ఎకరాల స్థలంలో స్టోరేజీ సదుపాయాలను అందుబాటులో ఉంచుతుంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు పెద్దెత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, దీనిపై మీ స్పందన ఏమిటని నాస్సార్‌ను ప్రశ్నించగా, స్థానిక భాగస్వాములతో కలిసి ఈ అంశాన్ని పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









