షార్ట్ ఫిల్మ్‌లకు నంది అవార్డులు
- April 11, 2018
చలన చిత్ర, నాటక, టివి రంగంలో మాదిరిగా షార్ట్ ఫిల్మ్‌లకు కూడా నంది అవార్డులు ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డిసి) చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. విజయవాడ ఎఫ్‌డిసి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చలన చిత్ర, నాటక, టివి రంగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం షార్ట్ ఫిల్మ్‌లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అమరావతి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్-2017ను నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడకు చెందిన డూండీ సర్వీసెస్ సహకారంతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో వస్తున్న మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. యువతరాన్ని ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేవలం తెలుగు భాషలో నిర్మించిన 5 నుంచి 20 నిముషాల నిడివి గల ఫిల్మ్‌లను మాత్రమే పంపాలని సూచించారు. వీటిని 2017 జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి ఉండాలన్నారు. రూ. 1000 ఎంట్రీ ఫీజు చెల్లించాలన్నారు. నిర్ణీత దరఖాస్తుతో పాటు ఫిల్మ్‌ను మే 15 లోగా ఎఫ్‌డిసి కార్యాలయంలో నేరుగా అందజేయాలన్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా నియమించిన జ్యూరీ 100 షార్ట్ ఫిల్మ్‌లను ఎంపిక చేస్తుందన్నారు. వీటిలో ప్రథమ బహుమతిగా లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతిగా రూ. 50 వేలు, తృతీయ బహుమతిగా రూ.25 వేలతో పాటు ఇతర బహుమతులు కూడా అందజేస్తామన్నారు. ఈ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









