ఐఫా అవార్డుల వేడుక వాయిదా...

- December 03, 2015 , by Maagulf
ఐఫా అవార్డుల వేడుక వాయిదా...

మొట్టమొదటి సారిగా హైదరాబాద్ లో సౌత్ ఇండియన్ సినిమాలకు సంబందించిన ఐఫా అవార్డుల వేడుకను హైదరాబాద్ లో నిర్వహించాలని ఐఫా సంస్థ ప్లాన్ చేయగా, ఆ వేడుకల కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమానికి నాలుగు భాషలకు సంబంధించిన సెలబ్రిటీలు హాజరు కానుండగా ,గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 5 నుండి 7 వరకు ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. గత కొన్ని రోజులుగా చెన్నై నగరం వర్షాలు,వరదలతో వణికిపోతుండగా పలువురు తమ ఆశ్రయాలను కూడా కోల్పోయారు. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజలకు మద్దతుగా నిలబడాలని,తీవ్రంగా నష్టపోయిన సమయంలో ఇలాంటి వేడుకలు నిర్వహించడం సరికాదని కెసిఆర్ తెలిపారు.దీంతో సౌత్ ఇండియన్ సినిమాలకు సంబంధించిన ఐఫా వేడుకను జనవరి నెలలో నిర్వహిస్తామన్నట్టు ఐఫా సంస్థ తెలిపింది. జనవరి నెలలో జరగనున్న ఐఫా వేడుకల తేదిలను ఆ సంస్థ త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది.అంతేకాక ఈ వేడుకలలో విరాళాలు సేకరించి చెన్నై ప్రజలకు అందించాలనే భావనలో ఈ సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com