మదిని మీటిన వర్షం-పార్ట్-6
- December 03, 2015
తను కొట్టబోతోంది అని అర్థం అయ్యాక తన చేయి వదిలి బాధతో కళ్ళు మూసుకున్న, మనసు చివుక్కుమంది, హృదయం బాధతో బరువెక్కింది, గుండె చప్పుడు జోరుగా వినిపిస్తోంది బాధతో కొట్టుమిట్టాడుతూ, ఇంకా తన చెంపదెబ్బ ఎంత ప్రళయం చూపిస్తుందో … ఒక 3 సెకండ్స్ అయింది దెబ్బ పడలేదు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే తను పెదవులు ముడుచుకొని చిన్నగా నవ్వుతు నా చెవులు పట్టుకొని గట్టిగా తిప్పింది దెబ్బకి చెప్పులు వదిలేసా క్షణాల్లో అక్కడ నుంచి చెప్పులు మాయం… ఈ గ్యాప్ లో దొరికిందే ఛాన్స్ కదా అని లారక్క ఇంకో చెవి పట్టుకొని పిండుతోంది వర్ష మత్తులో ఉన్న నేను పట్టించుకోలేదు ఎందుకంటే మనకు ఇష్టమైన వాళ్ళు ఇచ్చే ప్రతి కష్టం ఆనందంగానే ఉంటుంది. వర్ష చెవులు వదిలాక అర్థం అయింది నొప్పి, ఏనుగు కాలు కింద పడిన ఎలుక చెవులు లాగ నలుపుతోంది… ఎలాగో అలాగ చెవులు వదిలించుకుని ఏడుపు మొహంతో వెనక్కి తిరిగా మా గ్యాంగ్ మొత్తం పడి పడి నవ్వుతున్నారు చెప్పులు మిస్ చేసినందుకు ఒక చిన్న ఉమ్ము ఉమ్మారు … అభి గాదు “పరువు తీసావు కదరా, మరి ఇంత సొల్లు కార్చల్న ఎదవ??” నేను అలాగే సిగ్గు పడుతూ నిల్చున్న “చాలు సిగ్గు పడింది ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఎంత అడుగుతారో కొంచం ఈ లోకం లోకి రా అసలే ఆ బండధాన్ని ఎదురుకోవడం మా వాళ్ళ కాదు పెద్ద లెక్క లో ఉంది… “ బండదాని పేరు వినగానే ఫ్యాక్సన్ సినిమాల్లో బాలయ్య బాబు లాగ విపరీతమైన కోపంతో, ఎర్రని కళ్ళతో స్లో మోషన్ లో దాని పక్క తల తిప్పాను చెప్పులు చూపిస్తూ నవ్వుతు ఎకిరిస్తోంది… “రేయ్ ఇప్పుడు కాశి యాత్ర ఉంది దయచేసి లేని పోనివి చెప్పి పరువు తీయకండ్ర … అసలే ఏం అలవాట్లు లేవు అని చాల బిల్డ్ అప్ ఇచ్చాను రా ఇప్పుడు మీరు బయట పెడితే నందు చీరేస్తుంది చూడటానికి అమాయకురాలు కాని ఈ విషయాల్లో శీలరాకాసి కనీసం శోభనం అయ్యేవరకు ఇలా మంచి బాలుడిలా ఉండనివ్వండి రా లేకుంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనట్టు అయిపోతుంది నా పెళ్లి లైఫ్ ” అని బతిమిలాడాడు అందరితో రిక్వెస్ట్ చేసాక కేరళ ట్రిప్ లో మందుకి శ్పొన్సొర్ చేయమను అప్పుడు ఒప్పుకుంటాం అని అన్నారు ఇదే విషయం వాడితో చెప్పను “రేయ్ 20k నా వాళ్ళ కాదు ఆల్రెడీ మీ వాళ్ళ ఇప్పుడు అమ్మాయిల దగ్గర ఎంత బొక్క పడుతుందో తెలిదు నా వాళ్ళ కాదు మీ ఇష్టం ఏమైన చెప్పండి నందుకి కావాలంటే శోభనం రోజు తన కాళ్ళు పట్టుకుంటా అంతే కాని మీకు 20k మాత్రం ఇవ్వను” … “నీ కక్క్రుత్తి తగలెయ్య చావద్దు నీ కోసం కాకపోయినా ఆ బండదాని ముందు మనం చులకన అవ్వడం నాకు ఇష్టం లేదు ముందు దాన్ని సంగతి చూస్తా తరువాత నువ్వు” …. అభి గాడిని కాశి యాత్రకు రెడీ చేస్తున్నారు నందిని ని గౌరీ పూజ కు తీసుకెళ్ళారు ..
బ్రహ్మచర్యాన్ని గంగలో వదిలేయడానికి మనోడు కాశి యాత్రకు బయల్దేరడానికి సిద్ధం అయ్యాడు.. చేతికర్ర, గొడుగు, విసనకర్ర, భుజానికి జోలె తగలించుకున్నాడు, వేసుకోవడానికి చెప్పులు లేవు చేతిలో cheppulu పెట్టుకొని గ్యాంగ్ మొత్తం ఎదురుగా నిలపడి ఉన్నారు …. అభి గాడు చెప్పులు ఇమ్మని రిక్వెస్ట్ చేసాడు పదివేలు ఇస్తేనే ఇస్తాం అన్నారు …. “రేయ్ అభి పదివేలకి పది బ్రాండెడ్ చెప్పులు వస్తాయి” “రేయ్ ఇప్పుడు వెళ్లి అవన్నీ కొనుక్కొని రావడానికి టైం పడుతుంది ముహూర్తం దాటిపోతుంది” అంది బండది “ఇలా మీరు అంటారని ముందు జాగ్రత్తగా ఇంకో జత చెప్పులు పెట్టుకున్న మీరు వాటిని మడిచి డబ్బాల్లో పెట్టుకోండి” అన్నాను “రేయ్ అది నిన్న వచ్చేటప్పుడు వేసుకున్న అన్నాడు “ అమ్మాయిలు అంత నవ్వేసారు... నీ ఎదవ అని వాణ్ణి తిడుతుంటే “రేయ్ మావా ఇచ్చేద్దాం లేట్ అయిపోతుంది అని చెప్పాడు చిన్నగా” వీడబ్బ ఎడారి లో బీర్ బాటిల్ కోసం కక్క్రుత్తి పడేవాడు లాగ తహ తహ లాడి పోతున్నాడు ఎదవ … “రేయ్ మేము అడిగితే డబ్బులు ఇవ్వవు ఆడాళ్ళు అడగగానే పదివేలు ఇస్తావా నువ్వు ముయి ఆ పదివేలు నాకివ్వు ఐదు వేలులో మేటర్ సెటిల్ చేసి మిగతాది మేము తీసుకుంటాం” అని చెప్పా.. సరే అని తల ఊపాడు… రాజు గాన్ని వెంట పెట్టుకొని గ్యాంగ్ దగ్గరికి వెళ్లి అందరిని ఒక సారి చూసి బేరం మొదలు పెట్టాను “అమ్మాయిలూ చెప్పులు ఇచ్చేస్తే మీకో మేము హైదరాబాద్ వెళ్ళగానే గ్రాండ్ పార్టీ ఇస్తాము" "ఎక్కడ??", "బంజారా హిల్స్ రోడ్ నం 12 లో" "తాజ్ బంజారా ఉంది అందులోనా " అనింది ఒక అమ్మాయి నోరు కప్పలాగా తెరిచి... ఏదో బావర్చి బిర్యానీ అనుకుంటే ఇది తాజ్ కె టెండర్ వేస్తోంది... "కాదు పాప ముందు నోరు మూసుకో ఈగలు పోతాయి.. అక్కడ నుంచి ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే" "అక్కడ తాజ్ కృష్ణ అందులోన" ఇంకో పాప జొల్లు కారుస్తూ".... అమ్మా ఈ ఆడోళ్ళుగ్యాప్ ఇస్తే మొత్తం నాకేసే లాగ ఉన్నారే ".... "కాదు దాని పక్క సందులో చిన్న మెస్ ఉంది దాంట్లో ఫుల్ మీల్స్ లారక్క నీకు మాత్రం జంబో మీల్స్“ .... "నీ తొక్కలో డీల్ మాకు నచ్చలేదు మంచి ఆఫర్ చెప్పు " … " సరే 1500" ... తల అడ్డంగా ఊపారు... "2000" ... నో అని గట్టిగా అరిచారు ... "2500" ఇంకొద్దిగా స్పీడ్ పెంచారు "… వీళ్ళ ఊపుడు తగలయ్య ఎంత వయ్యారంగా ఊపుతున్నరో ఇలా కాదు కాని వర్షని దగ్గరికి పిలిచా …. “వర్ష గారు మా వాడు తేనె చంద్రున్ని( హనీమూన్) గ్రాండ్ గా ప్లాన్ చేస్కొని లోటు బడ్జెట్ లోకి వెళ్ళిపోయాడు కనీసం మా గ్యాంగ్ కి పార్టీ కూడా ఇవ్వలేదు చుడండి మా వాళ్ళు మందుకి మొహం మాసిపోయిన సోమాలియా బాధితుల్లగా ఎలా చూస్తున్నారో ఆశగా, కొంచం అడ్జస్ట్ చేస్కొని ఒక 3000 కి తెగ్గోట్టండి చెప్తా ప్లీజ్” అని రిక్వెస్ట్ చేస్కున్న తను గ్యాంగ్ ని కన్విన్సు చేయడానికి వెళ్ళింది …. పక్కన ఉన్న రాజు గాడికి “రేయ్ ఈ డీల్ గురించి అభి గాడికి తెలికుడదు వాణ్ణి కవర్ చేయి పో అని చెప్పి పంపించా ”… గ్యాంగ్ మొత్తం మూడు వేలకి ఒప్పుకుంది డబ్బులిచ్చి చెప్పులు తీసుకొచ్చి అభి కాళ్ళ దగ్గర పెట్టారు వీడు చెప్పుల్లు వేసుకున్నాక “ఏదో పాపం అని 3000 కి ఒప్పుకున్నాం నెక్స్ట్ టైం కి బాగా డబ్బు రెడీ చేసి పెట్టుకోండి ఇంత తక్కువ మనీ కి అసలు ఒప్పుకోము” అంది బండది.. అభి గాడు నా వైపు 3000 ఏంట్రా పది వేలు కదా ఇచ్చింది అన్నాడు … “పదివేలా అంది బండది షాక్ తో ” … నీ సీమిడి ముక్కు మొహానికి అది ఎక్కువ పోవే అని ఏడూ వేలు లెక్కపెడుతూ ఎక్కిరిస్తున్నా …. బండది వర్ష ని సీరియస్ గ చూస్తోంది కన్విన్సు చేసినందుకు ... నమ్మించి ఫూల్ చేసినందుకు వర్ష నన్ను తిట్టుకుంటూ కోపంగా చూస్తోంది .. నేను ఆ డబ్బు రెండు చేతుల్లో తీసుకొని చెవి గాలి వేసుకుంటున్న పోగరుతో ఒక నవ్వు నవ్వి కన్ను కొట్టి గ్యాంగ్ దగ్గరికి వెళ్లాను
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







