సింగపూర్ పర్యటనలో చంద్రబాబు బిజిబిజీ

- April 12, 2018 , by Maagulf
సింగపూర్ పర్యటనలో చంద్రబాబు బిజిబిజీ

సింగపూర్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజిబిజీగా ఉన్నారు. తెల్లవారుజామున మూడున్నర గంటలకు సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి.. వెంటనే కార్యాచరణ ప్రారంభించారు. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పారిశ్రామిక, వాణిజ్య, రాజకీయ ప్రముఖులతో సమావేశమై.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు చంద్రబాబు. 

ఫస్ట్ హెచ్‌టీ- మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.  సమ్మిట్‌లో చంద్రబాబును పరిచయం చేస్తూ ఆధునిక సాంకేతికతను పాలనలోప్రవేశపెట్టిన సీఎంగా, సంస్కరణవాదిగా అభివర్ణించారు నిర్వాహకులు. రాజధాని అమరావతి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన చంద్రబాబు.. సింగపూర్ మోడల్‌లో అన్ని హంగులతో కూడిన రాజధాని నిర్మిస్తామని చెప్పారు. రాజధాని లేకపోవడం ఏపీకి అతి పెద్ద సంక్షోభమన్నారు. హైదరాబాద్‌ను బ్రౌన్ ఫీల్డ్ సిటీగా తీర్చిదిద్దామని. సైబరాబాద్ ను నిర్మించిన అనుభవం ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం బృహత్ ప్రణాళికను సింగపూర్ సర్కారే ఇచ్చిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సలెంట్ల ద్వారా రాజధాని ఆకృతులు, ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. మౌలిక వసతుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com