దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో డైవర్షన్‌

- April 13, 2018 , by Maagulf
దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో డైవర్షన్‌

దుబాయ్‌లోని ప్రముఖ రహదారిపై డైవర్షన్‌ని ఏర్పాటు చేశారు. రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌ టన్నెల్‌ ద్వారా డేరా, మర్రాకెచ్‌ స్ట్రీట్‌ వైపు వెళ్ళే వాహనదారులు డైవర్షన్‌ పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. ఏప్రిల్‌ 13 నుంచి ఈ మార్గంలో ట్రాఫిక్‌ని తాత్కాలికంగా మర్రాకెష్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద రౌండెబౌట్‌కి మరల్చుతారు. అప్పర్‌ బ్రిడ్జ్‌కి బదులుగా మోటరిస్టులు ఈ మార్పుని అనుసరించాలని అధికారులు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com