నాన్‌ ఎమిరేటీ ఉద్యోగులకు సేలరీ హైక్‌

- April 14, 2018 , by Maagulf
నాన్‌ ఎమిరేటీ ఉద్యోగులకు సేలరీ హైక్‌

నాన్‌ ఎమిరేటీ షార్జా గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌కి 10 శాతం సేలరీ హైక్‌ ఈ ఏడాది జనవరి నుంచి వర్తించనుంది. షార్జా రూలర్‌, మెంబర్‌ ఆఫ్‌ సుప్రీమ్‌ కౌన్సిల్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి డైరెక్షన్స్‌ మేరకు ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. షార్జా గవర్నమెంట్‌ ఉద్యోగులందరి జీతాల్ని 2018 బిగినింగ్‌లో పెంచదలచుకున్నామని, ఈ క్రమంలోనే నాన్‌ ఎమిరేటీలకూ జీతాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. నాన్‌ ఎమిరేటీ ఉద్యోగులు తమ లాయల్టీని ప్రదర్శిస్తున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు రూలర్‌. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి పెరిగిన జీతాలు. సుమారు 600 మిలియన్‌ దిర్హామ్‌ల మేర మొత్తం జీతాలు పెరిగినట్లు తెలియవస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com