ఘనంగా డా.బి.ఆర్ అంబేద్కర్‌ జయంతి వేడుకలు

- April 14, 2018 , by Maagulf
ఘనంగా డా.బి.ఆర్ అంబేద్కర్‌ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్‌ 127వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.  దళితుల అభ్యున్నతికి కృషి చేసిన ఆయన్ను దేశవ్యాప్తంగా ప్రముఖ నేతలంతా స్మరించుకోనున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాయి.

భారత రాజ్యంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలోని ఆయన విగ్రహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత కలలను నిజం చేయాలని రాష్ట్రపతి పిలుపిచ్చారు. (385)

ఇఎ ఏపీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా దళితులకు వరాలు ప్రకటించారు సీఎం చంద్రబాబు. దళితులకు తొలిసారిగా పక్కాఇళ్లు కట్టించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించిన సీఎం.. దళితులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.

అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దళిత పారిశ్రామిక వేత్తలకు అవార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్‌.. దళితుల కోసం ప్రత్యేక బిజినెస్‌, ఫిట్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నట్టు దేశంలో ఇంకెక్కడా ప్రోత్సహించడం లేదన్నారు.

ఎంపీ కవిత ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లాలో అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు 

హైదరాబాద్‌లో అంబేద్కర్‌ 127వ జయంతి ఘనంగా నిర్వహించారు.. ట్యాంక్‌బండ్‌ దగ్గర ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వివిధ పార్టీల నేతలు నివాళి అర్పించారు. రాజ్యాంగం ద్వారా గొప్ప మార్పు  తీసుకురావచ్చని అంబేద్కర్‌ నిరూపించారని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు..

నల్గొండ జిల్లాలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎంపీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, గాదరి కిషోర్‌, ఎమ్మెల్సీ పూల రవీందర్‌, కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, ఎస్పీ రంగనాథ్‌ తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.

అంబేద్కర్ 127వ జయంతిని పురస్కరించుకొని ప్రబుద్ద భారత్ ఆధ్వర్యంలో నెక్లస్ రోడ్‌లో కాస్ట్ ఫ్రీ ఇండియా పేరుతో రన్ ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో జేపీ, ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com