బెజవాడలో బైక్ క్యాబ్‌లు
- April 15, 2018
విజయవాడ: మీరు త్వరగా రైల్వేస్టేషన్‌కు వెళ్లాలా? కళాశాలకు ట్కెం అయిపోతుందా? చరవాణిలో ఒక్క క్లిక్ కొట్టండి.. నిముషాల్లో ద్విచక్రవాహనం మీముందుంటుంది. నిర్ణీత సమయానికి మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. ద్విచక్రవాహన క్యాబ్‌లు ఇప్పుడు నూతన ఒరవడి సృష్టిస్తున్నాయి. విజయవాడలో ర్యాపిడో సంస్థ ద్విచక్రవాహనాల క్యాబ్‌లకు శ్రీకారం చుట్టింది. నవ్యాంధ్రలో ప్రజల జీవన విధానం మారుతోంది. కార్లు, ఆటోలతో పాటు ద్విచక్రవాహనాలు క్యాబ్‌లుగా మారుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిమిషాల్లో చేరుస్తామంటూ దూసుకుపోతున్నారు బైక్ క్యాబ్ రైడర్స్. ర్యాపిడో సంస్థ బెంగళూరు కేంద్రంగా విజయవాడలో బైక్ క్యాబ్ సేవలందింస్తోంది. ఇప్పటికే 250 మంది వాహనదారులు డ్క్రెవర్లుగా పేర్లు నమోదు చేసుకోగా.. ప్రస్తుతం 100 మందితో క్యాబ్ సేవలను ప్రారంభించారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు బైక్ క్యాబ్ సేవలు అందుబాటులో ఉంటాయి. నగరంలో 20 కిలోమీటర్ల పరిధి వరకు ఈ సేవలను అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









