మధ్యప్రదేశ్:ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మంది మృతి
- April 18, 2018
మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి అనంతరం జరిగే రిసెప్షన్ వేడుక ముగించుకుని కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వస్తున్నారు. ఈక్రమంలో వారి వాహనం జోగ్దాహా బ్రిడ్జిపై వెళుతోంది. వేగంగా వెళుతున్న వాహనం బ్రిడ్జి గోడకి గుద్దుకోవడంతో సోన్ నదికి సుమారు 70 అడుగుల ఎత్తులో ఉన్న ట్రక్కు పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం స్థానికుల సహాయంతో గాలించగా స్పాట్లోనే 15 మంది మృతి చెందినట్లు, మరో 7గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుంటే మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేల సహాయాన్ని ప్రకటించినట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









