సిరియాలో సైనిక దళాల మోహరింపుపై సౌదీ - అమెరికా చర్చలు
- April 18, 2018రియాద్: సిరియాలో అంతర్జాతీయ సంకీర్ణ దళాల ఏర్పాటులో భాగంగా తమ సైన్యాలను మోహరించే అంశంపై సౌదీ అరేబియా అమెరికాతో చర్చలు జరిపినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆదెల్ అల్ జుబెయిర్ చెప్పారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదని, గత అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిపాదించిన అంశమేనని వివరించారు. ఈ అంశంపై తాము ప్రస్తుతం అమెరికాతో చర్చిస్తున్నామని, సిరియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి అక్కడికి సైనిక దళాలు పంపే అంశంపై అమెరికాతో తాము చర్చిస్తూనే వున్నామని ఆయన చెప్పారు. ఈ మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?