రోడ్డు ప్రమాదం చూసి షాకయిన పారామెడిక్
- April 18, 2018పారామెడిక్‌గా 16 ఏళ్ళలో ఎన్నో ప్రమాదాల్ని కళ్ళతో చూసి, వాటికి అలవాటైపోయిన ఓ వ్యక్తి, ఓ ప్రమాదాన్ని చూసి మాత్రం షాక్‌కి గురయ్యారు. కారణం ఆ ప్రమాదంలో 12 ఏళ్ళ సోదరుడు, ఓ కుటుంబ సభ్యుడ్ని చూడాల్సి రావడమే. పారామెడిక్ ఫిహ్యాన్ అలియాన్ అలజాబ్రి మెదినాలోని సౌదీ రెడ్ క్రిసెంట్లో పనిచేస్తున్నారు. యాక్సిడెంట్ గురించిన సమాచారం అందగానే, విధి నిర్వహణలో భాగంగా ప్రమాద స్థలానికి చేరుకున్న తనకు ఆ ఘటన చూసి చాలా చాలా బాధ కలిగించిందనీ, ఆ క్షణంలో తనకేమీ అర్థం కాలేదని చెప్పారు. అక్కడ ఆ పరిస్థితుల్లో గాయాలతో బాధపడుతున్న చాలామందిలో తన సోదరుడూ వున్నాడనీ, అందరితోపాటే తన సోదరుడికీ సహాయం అందించేందుకు ప్రయత్నించానని అన్నారాయన. ఈ ఘటనలో ఫిహ్యాన్ సోదరుడు ప్రాణాలు కోల్పోగా, బంధువు గాయాలతో బయటపడ్డారు. మొత్తం నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ఓ పుస్తకం రాయాలని ఫిహ్యాన్ నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు