రోడ్డు ప్రమాదం చూసి షాకయిన పారామెడిక్
- April 18, 2018
పారామెడిక్‌గా 16 ఏళ్ళలో ఎన్నో ప్రమాదాల్ని కళ్ళతో చూసి, వాటికి అలవాటైపోయిన ఓ వ్యక్తి, ఓ ప్రమాదాన్ని చూసి మాత్రం షాక్‌కి గురయ్యారు. కారణం ఆ ప్రమాదంలో 12 ఏళ్ళ సోదరుడు, ఓ కుటుంబ సభ్యుడ్ని చూడాల్సి రావడమే. పారామెడిక్ ఫిహ్యాన్ అలియాన్ అలజాబ్రి మెదినాలోని సౌదీ రెడ్ క్రిసెంట్‌లో పనిచేస్తున్నారు. యాక్సిడెంట్ గురించిన సమాచారం అందగానే, విధి నిర్వహణలో భాగంగా ప్రమాద స్థలానికి చేరుకున్న తనకు ఆ ఘటన చూసి చాలా చాలా బాధ కలిగించిందనీ, ఆ క్షణంలో తనకేమీ అర్థం కాలేదని చెప్పారు. అక్కడ ఆ పరిస్థితుల్లో గాయాలతో బాధపడుతున్న చాలామందిలో తన సోదరుడూ వున్నాడనీ, అందరితోపాటే తన సోదరుడికీ సహాయం అందించేందుకు ప్రయత్నించానని అన్నారాయన. ఈ ఘటనలో ఫిహ్యాన్ సోదరుడు ప్రాణాలు కోల్పోగా, బంధువు గాయాలతో బయటపడ్డారు. మొత్తం నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ఓ పుస్తకం రాయాలని ఫిహ్యాన్ నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







