ఇండియా: రైల్వే టికెట్ ఆన్‌లైన్ బుకింగ్‌లో సమస్యలు రాకుండా..

- April 19, 2018 , by Maagulf
ఇండియా: రైల్వే టికెట్ ఆన్‌లైన్ బుకింగ్‌లో సమస్యలు రాకుండా..

ఆన్‌లైన్‌ వచ్చాక గంటలు గంటలు క్యూల్లో నిల్చోవాల్సిన పనిలేదు. ఆఫీసు నుంచే అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. రైల్వే టికెట్లకు సంబంధించి కొన్ని ఆన్‌లైన్ నిబంధనలు పాటిస్తే టికెట్ బుకింగ్ సులభమవుతుంది. దీని కోసం ఐఆర్‌సీటీసి వెబ్ సైట్లోకి లాగిన్ చేసిన తరువాత స్క్రీన్ మీద చూపించిన ఆప్షన్లను వెంట వెంటనే క్లిక్ చేయాలి. లేకపోతే మళ్లీ లాగిన్ కావాల్సి ఉంటుంది. అంతే కాకుండా బుకింగ్‌లో ఏవిధమైన సమస్యలు రాకుండా ఉండాలంటే తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..

*  ఒక నెలలో ఒక ఐడీ మీద 6 టికెట్లు మాత్రమే బుక్ చేయాలి. 
*  ఐడీకి ఆధార వెరిఫికేషన్ పూర్తయివుంటే 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
*  ఉదయం 8నుంచి 10 గంటల లోపు అయితే రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. 
*  ప్యాసింజర్ డిటైల్స్ పేజీలో కేవలం 25 సెకన్లలోనే వివరాలు నమోదు చేయాలి. 
*  పేమెంట్ చేసేందుకు కూడా 10 సెకన్లు మాత్రమే సమయం ఉంటుంది. 
*  పేమెంట్ చెల్లింపు కోసం కార్డుల వినియోగంలో ఓటీపీ తప్పనిసరిగా జత చేయాలి. 

ఇక తత్కాల్ టికెట్ల నిబంధనలు పరిశీలిస్తే..
*  ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఒకే యూజర్ ఐడీ మీద కేవలం రెండు టికెట్లు (అంటే రిటర్న్ జర్నీతో కలిపి) మాత్రమే బుకే చేసే వీలుంది.
*  ఒక ఐపీ అడ్రస్ మీద కేవలం రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే సదుపాయం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com