రామ్ చరణ్ బావతో శ్రియా భూపాల్ నిశ్చితార్థం..!!
- April 23, 2018జీవీకే కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్ ప్యాషన్ డిజైనర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని అఖిల్‌తో శ్రియా నిశ్చితార్థం జరగడం తర్వాత క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అఖిల్‌తో బ్రేకప్ తర్వాత శ్రియా భూపాల్ గురించి పలు వార్తలు వచ్చాయి. అనిందిత్ తో ప్రేమలో ఉన్నట్టు అతనితో కలిసి శ్రియా తిరుగుతున్నట్లు చాలా వదంతలు వినిపించాయి. తాజాగా శ్రియా, అనిందిత్ల నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరి బంధువు పింకీ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంతకి ఎవరి అనిందిత్ అనుకుంటున్నారా..! అతను రామచరణ్‌కు వరుసకు బావ అవుతాడు.. ఎలా అంటే.. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతల కుమారుడు అనిందిత్. సంగీత, ఉపాసన తల్లి శోభన అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసనకు అనిందిత్ సోదరుడు అవుతాడు కనుక రామచరణ్‌కు బావ అన్నమాట. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసనలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..