ఖతార్‌లో సందడి చేయనున్న షారుక్‌

- April 25, 2018 , by Maagulf
ఖతార్‌లో సందడి చేయనున్న షారుక్‌

దోహా: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌ ఖతార్‌లో సందడి చేయనున్నారు. ఏప్రిల్‌ 26న ఆయన దోహాలోని ఓ జ్యుయెలరీ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌ షోరూం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారనీ, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన్ని చూసేందుకు ఆ కార్యక్రమానికి హాజరవుతారనీ నిర్వాహకులు చెబుతున్నారు. లులు హైపర్‌ మార్కెట్‌ పక్కనే ఈ కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌ షోరూం ఏర్పాటయ్యింది. రాత్రి 9 గంటలకు ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఐదుగురు లక్కీ విన్నర్స్‌కి 8 గ్రాముల గోల్డ్‌ గెల్చుకునే అవకాశం వుందనీ, అలాగే సూపర్‌ స్టార్‌ షారుక్‌తో సెల్ఫీ దిగే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఖతార్‌లో ఇప్పటికే కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌కి 7 బ్రాంచీలు వున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com