శ్రీలంకలో రెండు రోజులు మద్యం, మాంసం నిషేధం...

- April 27, 2018 , by Maagulf
శ్రీలంకలో రెండు రోజులు మద్యం, మాంసం నిషేధం...

తొలిసారిగా ఓ రెండు రోజులు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుద్ధుని జయంతి వేడుకల్లో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించే వెషాక్ ఫెస్టివల్ ఏప్రిల్ 29వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు రోజులపాటు సూపర్‌ మార్కెట్లు, హోటళ్లలో మాంసం, మద్యంను విక్రయించరాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా బుద్ధ పూర్ణిమ సమయంలో శ్రీలంకలో బార్లు, రెస్టారెంట్లు మూసివేస్తారు. అయితే తొలిసారిగా మాంసం విక్రయంపై కూడా ఆంక్షలు విధించింది శ్రీలంక ప్రభుత్వం.

అహింస అనేది బుద్ధుని సిద్ధాంతం కాబట్టి.. ఆయన జయంతి రోజున మాంస విక్రయాలు చేయడం కూడా అనైతికమని భావించిన శ్రీలంక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మాంసం దుకాణాలతో పాటు సూపర్ మార్కెట్లలో లభించే ప్యాకేజ్డ్ మీట్ విక్రయాలపై కూడ ఈ రెండు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ కొత్త పద్ధతిని పాటించనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com