నిరుద్యోగులకు గుడ్ న్యూస్: రిలయన్స్ జియోలో 75 వేల ఉద్యోగాలు
- April 27, 2018
రానున్న ఆరు నెలల్లో 75 వేల మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించనున్నట్లు ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రకటించింది. సంస్థ సీహెచ్ఆర్ఓ సంజయ్ జోగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సంస్థ విస్తరణలో భాగంగానే బ్రాడ్ బ్యాండ్, పేమెంట్స్ బ్యాంకింగ్ వంటి మరికొన్ని విభాగాల్లో నియామకాలు చేబడుతున్నట్లు తెలియజేశారు. డిగ్రీ అర్హతతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఆర్ఎం ఇండియా టెక్ 18 సదస్సులో ఆయన మాట్లాడుతూ టెలికాం సంస్థలు విలీనమైనా, మూతపడ్డా అందులో పనిచేసే ఉద్యోగులకు ఎంత మాత్రం ఇబ్బంది ఉండదని అన్నారు. అంతే కాకుండా వారికి అనేక ప్రత్యేక మార్గాలు కూడా ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









