బ్లూ వేల్ సూసైడ్ రూమర్స్‌ని ఖండించిన దుబాయ్ పోలీస్
- April 27, 2018
దుబాయ్:బ్లూ వేల్ గేమ్‌లో భాగంగా ఇద్దరు యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ పోలీసులు ఖండించారు. కుటుంబ సమస్యల కారణంగా గ్రేడ్ 10 స్టూడెంట్స్ అయిన బాలుడు, బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.ముహైస్‌నాహ్‌లోని యునైటెడ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్‌కి చెందిన విద్యార్థులుగా వీరిని గుర్తించారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ ఆత్మహత్య గురించి మాట్లాడలేదని పోలీసులు స్పష్టం చేశారు. గత బుధవారం బాలుడి మృతదేహం అల్ కుసైస్‌లోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ బయట కనుగొనబడింది. ఆరో ఫ్లోర్ నుంచి ఈ బాలుడు కిందికి దూకినట్లు విచారణలో తేలింది. కాగా బాలిక తన బెడ్రూమ్‌లో ఉరివేసుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!